News October 6, 2025

కరీంనగర్: 42% రిజర్వేషన్ కు లైన్ క్లియర్ అయ్యేనా?

image

42% బీసీ రిజర్వేషన్‌పై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బరిలో నిలవాలనుకున్న బీసీ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రిజర్వేషన్లకు అనుగుణంగానే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. తీర్పు ఎలా వస్తుందో.. ఎలా ముందుకెళ్లాలో అనే దానిపై చర్చ జరుగుతోంది.

Similar News

News January 13, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ చైనా మాంజా వాడొద్దు: మణుగూరు DSP
✓ చుంచుపల్లి: పాఠశాల వద్ద హైటెన్షన్ ముప్పు
✓ సుజాతనగర్: ట్రాఫిక్ నియమాలు పాటించాలి: ఎస్పీ
✓ అశ్వారావుపేటలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
✓ ఈనెల 16, 17న పాల్వంచ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు
✓ దుమ్ముగూడెం: హెల్త్ సెంటర్లను తనిఖీ చేసిన DMHO
✓ కొత్తగూడెం: లిక్విడ్ గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్
✓ దుమ్ముగూడెం: విద్యుత్ షాక్‌తో వర్కర్‌కు గాయాలు

News January 13, 2026

NGKL: బాధ్యతగా ట్రాఫిక్ నియమాలు పాటించాలి: ఎస్పీ

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని రోడ్డు నిబంధనలను భయం కోసం కాకుండా బాధ్యతతో పాటించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సూచించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేగం కన్నా ప్రాణం ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ తమ కుటుంబాలకు భద్రతగా ఉండాలని కోరారు.

News January 13, 2026

తుర్కియే, పాకిస్థాన్, సౌదీ.. ‘ఇస్లామిక్ నాటో’ కూటమి?

image

పాకిస్థాన్, సౌదీ అరేబియాతో కలిసి ‘ఇస్లామిక్ నాటో’ అనే రక్షణ కూటమి ఏర్పాటు చేసేందుకు తుర్కియే ప్లాన్ చేస్తున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్’ నివేదిక వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తుర్కియే 350 డ్రోన్లు ఇచ్చి పాక్‌కు సపోర్ట్ చేసింది. మరోవైపు గతేడాది పాకిస్థాన్-సౌదీ అరేబియా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కు డిఫెన్స్ పరంగా తలనొప్పేనని విశ్లేషకులు చెబుతున్నారు.