News August 12, 2025

కరీంనగర్: BRS బీసీ గర్జన సభ వాయిదా

image

ఈనెల 14న కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ తలపెట్టిన బీసీ గర్జన సభ వాయిదా పడింది. అయితే ఈనెల 14 నుంచి 17 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ సభను ఏర్పాటు చేశారు.

Similar News

News March 12, 2026

జీకేవీధి: ఊబ పొలం..ఊటనిరే ఆధారం

image

అల్లూరి జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ మంచినీటికి ఇబ్బందులు తప్పడం లేదు. గుక్కెడు మంచినీటికి అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఆయా గ్రామాల గిరిజనులది. అలా అల్లూరి జిల్లా రింతాడ పంచాయతీ ఊబపొలం గ్రామంలో మంచినీటి మంచినీళ్లు దొరక్క పొలాల గట్ల వద్ద ఊరే ఊట నీటినే ఆధారంగా జీవిస్తున్నారు. వర్షం వస్తే ఆ ఊట నీరు బురదగా మారుతున్నాయని స్థానిక మహిళలు తెలిపారు. మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు

News March 12, 2026

ప.గో: నిబంధనలు ఉల్లంఘిస్తే ఫోన్ చేయండి

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరంలో నిబంధనలు ఉల్లంఘించిన 12 మెడికల్ షాపుల లైసెన్స్ రద్దు, 550 మెడికల్ షాపులపై సస్పెన్షన్‌ను విధించామని అసిస్టెంట్ డైరెక్టర్ చక్రవర్తి బుధవారం తెలిపారు. ప్రజలు మందుల కొనుగోలు సమయంలో ఎక్స్‌ఫైరీ డేట్ చెక్ చేసుకుని, బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే 8632330909, 9491063158 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.

News March 12, 2026

వరి పంట విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

వరి పంట ప్రస్తుతం నాటిన సమయాన్ని బట్టి ఈనిక, గింజ పాలుపోసుకునే దశ, పూత దశలో ఉంది. ఈ సమయంలో పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ఒకవేళ పంట పూత దశలో ఉన్నట్లైతే నీటి ఎద్దడికి గురికాకుండా 2 అంగుళాల మేర నీరు ఉండేలా చూడాలి. పంట పిలక దశలో ఉంటే రెండో దఫాగా 45 kgల యూరియా వేయాలి. చిరుపొట్ట దశలో ఉన్న పొలాల్లో చివరి దఫా యూరియా 45KGలు+ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20kgలు వేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.