News September 13, 2025
కరీంనగర్: LMD రిజర్వాయర్‌లో వెరైటీ చేప..!

KNR జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన మత్స్యకారుడు బోళ్ల భూమయ్య రోజూలాగే చేపలు పట్టేందుకు శనివారం ఉదయం ఎల్ఎండీ రిజర్వాయర్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో వలలు తీస్తుండగా ఎర్రరంగులో ఉన్న వెరైటీ భారీ చేప అతడి కంటపడింది. కాగా, ఇలాంటి చేప ఇప్పటివరకు LMD రిజర్వాయర్‌లో లభించలేదని మత్స్యకారులు తెలిపారు. దీనిని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన చేపగా పలువురు చెబుతున్నారు. స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
Similar News
News December 15, 2025
మిరుదొడ్డి: ఆటో డ్రైవర్ నుంచి ఉపసర్పంచ్‌గా..

కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే ఆటో డ్రైవర్‌గా మారిన యువకుడు నేడు ఉపసర్పంచ్‌గా ఎన్నికై ఆదర్శంగా నిలిచారు. మిరుదొడ్డి మండలం కొండాపూర్ ఉపసర్పంచ్‌గా 23 ఏళ్ల సోమగల్ల భాస్కర్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 10వ వార్డు నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన భాస్కర్ అనంతరం ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, గ్రామస్థులకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
News December 15, 2025
ప్రతి అంశంలో కానిస్టేబుళ్లు కీలకం: చిత్తూరు SP

ప్రజా భద్రత కోసం నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లు అహర్నిశలు పనిచేయాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. విజయవాడలో నియామక పత్రాలు స్వీకరించనున్న 196 మంది అభ్యర్థులతో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కానిస్టేబుళ్లు చేసే కృషి మీదే శాంతి భద్రతల నిర్వహణ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి అంశంలోనూ కానిస్టేబుల్ పాత్ర కీలకమన్నారు.
News December 15, 2025
పెద్దపల్లి: వీ- హబ్ పనులు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం రంగంపల్లిలో నిర్మిస్తున్న కొత్త వీ- హబ్ భవనాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఏసీలు తదితర పెండింగ్ పనులు 3 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. కాగా, మహిళలకు పారిశ్రామిక శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ భవనం ఉపయోగపడనుంది. ఈ పర్యటనలో గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ పవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


