News August 14, 2025
కరీంనగర్: PACSలో నామినేటెడ్ ప్రక్రియ..?

<<17399669>>PACS<<>> పాలకవర్గాలను ఎన్నికల ద్వారా కాకుండా నామినేటెడ్ ప్రక్రియతో భర్తీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనికోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది. ఈ ప్రక్రియ పక్కనున్న APలో కొనసాగుతుంది. దీంతో ఎక్కువమంది కాంగ్రెస్ కార్యకర్తలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. PACS పాలకవర్గాల కాలపరిమితి నేటితో ముగుస్తుంది. ఈ సాయంత్రం కల్లా ఉత్తర్వులు వెలువడే ఆకాశముంది.
Similar News
News March 7, 2026
శ్రీకాకుళం: కేజీబీవీల్లో ప్రవేశాలకు వేళాయె!

పేద విద్యార్థులకు ప్రమాణాలతో విద్య అందిస్తున్న కేజీబీవీలో 6 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీలు ఉన్నాయి. ఈనెల 12 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. డ్రాప్ అవుట్, అనాధ, సింగిల్ పేరెంట్ బాలికలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
News March 7, 2026
సంతనూతలపాడు వద్ద రోడ్డు ప్రమాదం

సంతనూతలపాడు ఎండ్లూరు డొంక వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో ముందు భాగం దెబ్బ తిన్నది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News March 7, 2026
హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. 30వేల చ.అడుగుల ఈ ఆఫీస్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఈ నెల 12న ప్రారంభించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు ఇప్పటికే ముంబైలో కార్యాలయం ఉండగా భారత్‌లో ఇది రెండోది కానుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ రాకతో HYDలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ సెక్టార్లు బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.


