News October 5, 2025
కర్నూలులో ఆడ బిడ్డకు జన్మనిచ్చిన 10th క్లాస్ విద్యార్థిని

కర్నూలు పాతబస్తీకి చెందిన 15 ఏళ్ల బాలిక(10వ తరగతి) ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. గతనెల 28న కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికకు తల్లి మాత్రలు వేసింది. నొప్పి మరింత పెరగడంతో పాటు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చికిత్స పొందుతూ శిశువు మృతి చెందింది. ప్రేమ పేరుతో తనకు జరిగిన మోసాన్ని తల్లిదండ్రులకు బాలిక వివరించింది. తండ్రి ఫిర్యాదు మేరకు 1టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News January 14, 2026
మకర జ్యోతి, మకర విళక్కు ఒకటి కాదా?

మకర జ్యోతి, మకర విళక్కు ఒకటి కాదు. సంక్రాంతి రోజున ఆకాశంలో కనిపించే ఓ దివ్య నక్షత్రాన్ని మకర జ్యోతి అంటారని, ఇది ప్రకృతి సిద్ధమైనదని శబరిమల ప్రధానార్చకులు తెలిపారు. అదే సమయంలో పొన్నంబళమేడు కొండపై మూడు సార్లు ఓ హారతి వెలుగుతుంది. ఈ దీపారాధనను స్థానిక గిరిజనులు చేస్తారని దేవాలయ సిబ్బంది చెబుతోంది. ఈ హారతినే మకర విళక్కుగా భావిస్తారు. ఇది మానవ నిర్మితమని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు స్పష్టం చేసింది.
News January 14, 2026
ఇంటర్వ్యూతో BARCలో ఉద్యోగాలు

ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (<
News January 14, 2026
‘మన మిత్ర’తో వాట్సాప్‌లోనే పోలీస్ సేవలు: ఎస్పీ

గుంటూరు జిల్లాలో ‘మన మిత్ర-వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా సులభంగా పోలీస్ సేవలు పొందవచ్చని ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం తెలిపారు. ఇకపై ఎఫ్‌ఐఆర్ కాపీ, స్టేటస్, ఈ-చలానా వివరాల కోసం స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే చాలు. మెనూలో పోలీస్ సేవలను ఎంచుకుని వివరాలు పొందవచ్చు. ప్రజలు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని ఎస్పీ కోరారు.


