News August 14, 2025
కర్నూలు: అక్కడ బహిర్భూమికి వెళ్తే రూ.2,000 జరిమానా

కర్నూలు జిల్లా ఆస్పరిలోని చెరువులో బహిర్భూమికి వెళ్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ పంచాయతీ సెక్రటరీ విజయరాజు, సర్పంచ్ మూలింటి రాధమ్మ హెచ్చరించారు. ఈ మేరకు గ్రామంలో దండోరా వేయించారు. నిబంధన అతిక్రమించిన వారికి రూ.2,000 జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. చెరువు నుంచి బోర్లకు మంచినీరు వస్తుందని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
Similar News
News March 7, 2026
అల్లు అర్జున్‌తో శిల్పా రవి

అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహ వేడుకకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిశారు. ఈ సందర్భంగా శిల్పా రవి దంపతులు అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
News March 7, 2026
కర్నూలు: కాలేజీకి రాకుండానే పరీక్షలు.. బీఈడీ కాలేజీల దందా!

కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, హోళగుందలోని పలు బీఈడీ కాలేజీలు బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీకి రాకుండానే పరీక్షలు రాసేలా యాజమాన్యాలు విద్యార్థులతో ఒప్పందాలు కుదుర్చుకొని భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. RJD స్థాయిలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీల అనుమతులు రద్దు చేయాలని DSF విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది.
News March 7, 2026
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV టీకా డ్రైవ్

జిల్లాలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. 14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్టే బాలికలకు ‘గార్డాసిల్-4’ టీకా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. జిల్లాలో 19,704 మంది బాలికలను లక్ష్యంగా తీసుకుని ఈ కార్యక్రమం మూడు నెలలు కొనసాగుతుందని వెల్లడించారు.


