News September 22, 2024

కర్నూలు: అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

image

కేంద్ర ప్రభుత్వ పథకాలను కర్నూలు జిల్లా అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ.భరత్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు అధ్యక్షతన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు.

Similar News

News October 9, 2024

‘సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించండి’

image

సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రకటన వచ్చినందున ఉమ్మడి కర్నూలు జిల్లాలోని KC కెనాల్, తుంగభద్ర LLC, హంద్రీనీవా వంటి నీటి సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయని, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కోరారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపునకు నాంది కావాలన్నారు.

News October 9, 2024

పల్లెకు మంచి రోజులు

image

గ్రామాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె పండుగ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 14 నుంచి 20 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధికి సంబంధించి ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభలో ప్రతిపాదించిన పనులకు శ్రీకారం చుడతారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4500 కోట్లు కేటాయిస్తోంది. కాగా కర్నూలు జిల్లాలో 889, నంద్యాల జిల్లాలో 457 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

News October 9, 2024

హత్య కేసులో నంద్యాల జిల్లా వ్యక్తికి జీవిత ఖైదు

image

నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని ఎం.కృష్ణాపురం గ్రామానికి చెందిన బాల ఓబన్నకు తన భార్యను హత్య చేసిన కేసులో ఆళ్లగడ్డ అదనపు జిల్లా జడ్జి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. బాల ఓబన్న గతేడాది భార్య నేసే నాగమ్మను హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలు దఫాల విచారణ అనంతరం న్యాయమూర్తి తుది తీర్పును మంగళవారం వెలువరించారు. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించారు.