News June 15, 2024

కర్నూలు: గుండెపోటుతో ఎంఈఓ మృతి

image

చిప్పగిరి మండలంలో ఎంఈఓ-2 బాలనాయుడు శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. బాలనాయుడు బళ్లారి పట్టణంలో నివాసం ఉంటూ చిప్పగిరిలో ఎంఈఓ-2గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం రోజు మాదిరిగానే చిప్పగిరికి ఇంటి దగ్గర నుంచి వస్తుండగా గుండె నొప్పితో మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన స్వస్థలం ఆళ్లగడ్డ కావడంతో మృతదేహాన్ని ఆళ్లగడ్డకు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News September 21, 2024

విద్యార్థుల మంచి మనసు.. నంద్యాల కలెక్టర్‌కు విరాళం అందజేత

image

విద్యార్థులు తాము దాచుకున్న పాకెట్ మనీని వరద బాధితుల సహాయార్థం అందించడం అభినందనీయమని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. జూపాడుబంగ్లా మండలంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులు దాచుకున్న రూ.11,675 చెక్కును శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజకుమారికి అందించారు. ఉన్నతాధికారులు విద్యార్థులను అభినందించారు.

News September 20, 2024

587 మొబైల్స్ రికవరీ: ఎస్పీ

image

కర్నూలు జిల్లా పరిధిలో రూ.1,33,70,000 విలువ చేసే 587 మొబైల్స్‌ను ఎస్పీ బిందు మాధవ్ బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. మొబైల్ పోగొట్టుకున్న వారికి రికవరీ చేసి అందజేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎలాంటి రుసుము లేకుండా అందజేశామన్నారు. పోలీస్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 20, 2024

ముచ్చట్ల ఆలయ పూజారి కుమార్తెకు MBBSలో సీటు

image

బేతంచెర్ల మండలం రంగాపురానికి చెందిన ముచ్చట్ల ఆలయ పూజారి చంద్రమోహన్ రావు, వరలక్ష్మీ దంపతుల కుమార్తె ఇందు ప్రసన్నలక్ష్మీ కర్నూలు మెడికల్ కళాశాలలో MBBS సీటు సాధించింది. నీట్ ఫలితాల్లో 720 మార్కులు గాను 644 మార్కులు సాధించింది. గ్రామీణ విద్యార్థికి MBBSలో సీటు రావడం పట్ల గ్రామస్థులుచ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.