News November 19, 2025
కర్నూలు ఘోర ప్రమాదం.. మృతులు వీరే..!

కర్నూలు జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. జాతీయ రహదారిపై కేశవ గ్రాండ్ హోటల్ వద్ద రోడ్డు దాటుతున్న పాదచారులను హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కల్లూరు మండలం గోకులపాడుకు చెందిన లక్ష్మీనారాయణ(56), శ్రీనివాసులు(65), రామిరెడ్డి(40)గా పోలీసులు గుర్తించారు. మెకానిక్ షేక్ జిలాని బాషా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News January 14, 2026
టీచర్లకు చిత్తూరు DEO కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎంఈవోలు, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సిందేనని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. ఈనెల 13న 286 మంది విద్యాశాఖ ఉద్యోగులు ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉందన్నారు. 189 మంది మాత్రమే నమోదు చేశారని.. మిగిలిన వారు వేయలేదని చెప్పారు. వేయని వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.
News January 14, 2026
SV విద్యాదాన ట్రస్ట్‌కు రూ.10లక్షల విరాళం

చెన్నైకు చెందిన ధర లాజిస్టిక్స్ సంస్థ టీటీడీ శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. దాతను ఆయన అభినందించారు.
News January 14, 2026
Next 7Daysలో వెండి పెరిగేనా? తగ్గేనా?

ఇవాళ $94-$95 ఉన్న ఔన్స్ (28.3గ్రా.) సిల్వర్ ఈ నెలలో 100$కు చేరొచ్చనేది మార్కెట్ విశ్లేషకుల మాట. ఈ లెక్కన Next 7 Days వైట్ మెటల్ రేట్ పెరుగుతుందని వారి అంచనా. USA ఫెడరల్ రిజర్వు నిర్ణయాలు, ట్రంప్ ఆదేశాలపై సుప్రీంకోర్టు విచారణ, ఇరాన్ ఉద్రిక్తతలు తదితర అంశాలు స్టాక్స్‌లో ఒడిదుడుకులు, మెటల్స్‌లో గ్రోత్‌కు కారణం కావచ్చు అని తెలిపారు.
⚠️ఈ ఆర్టికల్ కొనడం/అమ్మడం ప్రోత్సహించేందుకు కాదు. అవగాహన కోసమే.


