News August 29, 2024

కర్నూలు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

image

సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 31న కర్నూలు జిల్లాకు రానున్నారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఆర్డీవో రామలక్ష్మి, డీఎస్పీ వెంకటరామయ్య గ్రామంలో స్థలాన్ని పరిశీలించారు. సెప్టెంబరు 1న సెలవు నేపథ్యంలో ఒకరోజు ముందుగానే 31న పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Similar News

News September 13, 2024

కర్నూలు జిల్లాలో రైలు మార్గం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా?

image

కర్నూలు జిల్లాలో మొట్టమొదటి రైలు మార్గం 1870లో ప్రారంభమైంది. ముంబై, చెన్నైలను కలుపుతూ ఏర్పడిన రైలు మార్గం ఆదోని, ఆలూరు ప్రాంతాల మీదుగా 97 కి.మీ మేర ఉంటుంది. దీంతో ఎగుమతులు, దిగుమతులకు ఆదోని కేంద్రంగా మారింది. అందుకే ఈ ప్రాంతానికి రెండో బాంబేగా పేరు వచ్చిందట. 1909లో కర్నూలు-డోన్, 1930లో కర్నూల్- హైదరాబాద్‌కు రాకపోకలు ప్రారంభమయ్యాయి. 1921 SEP 29న జాతిపిత మహాత్మా గాంధీ రైలులోనే కర్నూలుకు వచ్చారు.

News September 13, 2024

మంత్రి బీసీ ఆధ్వర్యంలో 18న మెగా జాబ్ మేళా

image

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 18న బనగానపల్లె డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి సతీమణి బీసీ ఇందిరారెడ్డి వెల్లడించారు. ఈ జాబ్ మేళాకు 9 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. 1,191 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసిన వారు అర్హులన్నారు.

News September 13, 2024

నగదు వసూలు చేస్తే చర్యలు: కలెక్టర్

image

ఆరోగ్య శ్రీ కింద పేషెంట్ల నుంచి నగదు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రంజిత్ బాషా ఆసుపత్రి యాజమాన్యాలను అదేశించారు. గురువారం ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శ్రీ కింద వస్తే ఉచితంగా చికిత్స ఇవ్వాలని, లేకపోతే అప్పుడు వారి నుంచి నగదు తీసుకునే ప్రక్రియను అన్ని ఆసుపత్రులు పాటించాలని అన్నారు.