News June 28, 2024

కర్నూలు జిల్లాలోని అటవీ భూములపై డిప్యూటీ సీఎం ఆరా

image

కర్నూలు జిల్లాలోని అటవీ భూములపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీశారు. ఈ సమావేశంలో పాల్గొన్న కర్నూలు డి.ఎఫ్.ఓ. శ్యామల, నంద్యాల డి.ఎఫ్.ఓ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీ శాఖ అధికారి సుబ్బరాయుడు ఇందుకు వివరాలను డిప్యూటీ సీఎంకు తెలియజేశారు.

Similar News

News February 15, 2025

కర్నూలులో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

కర్నూలు మెడికల్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అందిన వివరాల మేరకు.. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న రమ్యతేజ అనే విద్యార్థిని హాస్టల్‌లో పురుగు మందు తాగారు. గమనించిన సిబ్బంది వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. రమ్యతేజ అనంతపురానికి చెందిన యువతిగా తెలుస్తోంది. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.

News February 15, 2025

కర్నూలు మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు

image

ఏపీ టూరిజం ఆధ్వర్యంలో యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఈనెల 17న తిరుపతి, ఒంటిమిట్ట, ఓర్వకల్లు, కర్నూలు, హైదరాబాద్, బాసర, వారణాశి మీదుగా ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటుంది. తిరిగి జబల్‌పూర్, హైదరాబాద్, కర్నూలు, మహానంది మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ఈ బస్సు 17న మ.2.15 గంటలకు కర్నూలుకు వస్తుంది. టికెట్ ధర రూ.20వేలు, పిల్లలకు రూ.17, 200లుగా నిర్ణయించారు.

News February 15, 2025

కర్నూలులో బర్డ్ ఫ్లూ.. ‘ఆందోళన అవసరం లేదు’

image

కర్నూలులో బర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని నరసింహారావు పేటను రెడ్ జోన్‌గా గుర్తించి చికెన్, గుడ్ల అమ్మకాలను నిలిపివేశామని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో చికెన్, గుడ్ల అమ్మకం కొనసాగుతుందన్నారు. చికెన్‌ను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు.

error: Content is protected !!