News February 4, 2025
కర్నూలు జిల్లాలో టీడీపీలోకి 500 వైసీపీ కుటుంబాలు

కర్నూలు జిల్లా కోడుమూరు, ఆలూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. సుమారు 500 వైసీపీ కుటుంబాలు టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చకున్నాయి. కోడుమూరు వైసీపీ నేత ఎరుకల లింగన్న ఆధ్వర్యంలో మూడు నియోజకవర్గాల నుంచి టీడీపీలో చేరారు. పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని వారికి కోట్ల హామీ ఇచ్చారు.
Similar News
News January 16, 2026
పాణ్యం మండలంలో విషాదం

పాణ్యం మండలం తమ్మరాజుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని రత్నమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందారు. హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొని ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆమె ఫుట్‌పాత్‌పై పడి తీవ్ర గాయంతో మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
News January 16, 2026
కర్నూలు: మద్యం బాబులూ.. మీకు చిత్తడే..!

కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.