News September 11, 2025

కర్నూలు జిల్లా కొత్త కలెక్టర్ ఈమే!

image

కర్నూలు జిల్లా నూతన కలెక్టర్‌గా డా.అట్టాడ సిరి నియమితులయ్యారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న ఆమెను జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ రంజిత్ బాషాను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.

Similar News

News December 11, 2025

ఎస్‌ఐఆర్ పూర్తికి సహకరించండి: కర్నూలు ఆర్వో విశ్వనాథ్

image

కర్నూలు అసెంబ్లీలో ఎస్‌ఐఆర్‌ను బూత్ స్థాయిలో ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆర్వో పి.విశ్వనాథ్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ వివరాలు, చిరునామా, ప్రోజనీ సమాచారాన్ని తప్పనిసరిగా బూత్ యాప్‌లో నమోదు చేయాలని, నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కర్నూలులో 2,74,803 ఓటర్లలో ఇప్పటివరకు 37,561 మ్యాపింగ్, 15,821 ప్రోజనీ పూర్తి అయ్యాయన్నారు.

News December 11, 2025

కర్నూలు: ‘ఈనెల 21న జరిగే పల్స్ పోలియోను విజయవంతం చేయండి’

image

డిసెంబర్ 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు 3,52,164 మంది పిల్లలకు వందశాతం టీకా వేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జరిగిన మెడికల్ ఆఫీసర్ల సెన్సిటైజేషన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పీహెచ్సీలు, యుపిహెచ్సీలలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. బయటికి మందులు పంపకూడదు, డెలివరీ తర్వాత డబ్బులు వసూలు చేయకూడదు అని స్పష్టం చేశారు.

News December 11, 2025

కర్నూలు కలెక్టర్‌కు 9వ ర్యాంకు.. మంత్రి టీజీ భరత్‌ ర్యాంక్ ఇదే..!

image

కర్నూలు కలెక్టర్‌ డాక్టర్ ఏ.సిరికి సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 9వ ర్యాంక్ ఇచ్చారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక మొత్తం 1,023 ఫైల్స్ స్వీకరించారు. వాటిలో 714 ఫైల్స్ క్లియర్ చేశారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో కర్నూలు జిల్లా మంత్రి టీజీ భరత్ 17వ స్థానంలో నిలిచారు. 548 ఫైళ్లను పరిష్కరించారు.