News April 11, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤మంత్రాలయం: 25 జంటలకు తాలిబొట్లు, కాళ్ల మెట్టలు అందజేత ➤ జిల్లా నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం➤ అతివేగం.. మహిళ ప్రాణం తీసింది➤ శిరువెళ్ల హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్➤ కర్నూలు జిల్లాలో ఎస్ఐల బదిలీ➤ వెల్దుర్తి: క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్తే.. ఏమైందో చూడండి.!➤ హనుమాన్ శోభాయాత్రకి మంత్రి టీజీ భరత్ ఆహ్వానం➤ ఆదోని: రాజకీయ పార్టీ ప్రతినిధులతో సబ్ కలెక్టర్ సమావేశం.
Similar News
News January 24, 2026
జిల్లాలో మాతృమరణాల నివారణే లక్ష్యం: కలెక్టర్

కర్నూలు జిల్లాలో మాతృమరణాలను నివారించడమే లక్ష్యం పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె సంబంధిత శాఖల అధికారులు, కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మాతృమరణాలకు గల కారణాలపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News January 24, 2026
కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

జనవరి 26న PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ఎస్పీ సూచించారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.
News January 24, 2026
ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలి: జిల్లా కలెక్టర్

ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సరి సూచించారు. శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం పర్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన ‘జీరో- గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర’ అనే థీమ్‌తో ర్యాలీనీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితాతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి మొక్కలను నాటారు.


