News December 1, 2025

కర్నూలు జిల్లా రైతులకు దిత్వా భయం

image

కర్నూలు జిల్లా రైతులను దిత్వా తుఫాను భయపెడుతోంది. చేతికొచ్చిన వరి పంట నేలకొరిగితే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భారీగా పెట్టుబడి పెట్టిన రైతులు దిగాలు చేస్తున్నారు. ఒక్క పెద్దకడబూరు మండల పరిధిలోనే సుమారు 3వేల ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం తుఫాను ప్రభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.

Similar News

News February 18, 2026

ATP: రేపటి నుంచి రంజాన్.. ఉపవాస వేళలు

image

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభంకానుంది. అనంతపురం జిల్లాలో రేపటి ఉపవాస వేళలు ఇలా ఉన్నాయి.
☞ గుత్తిలో….
★ సహర్: ఉ.5-5.21
★ ఇఫ్తార్: సా.6.29
★ ఉపవాస కాలం: మొదటి రోజు సుమారు 13 గంటల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.
☞ నోట్: ప్రాంతాలను బట్టి వేళలు కొన్నినిమిషాలు మారొచ్చు.

News February 18, 2026

GWL: ప్రతిభ చాటిన విద్యార్థులకు కలెక్టర్ అభినందన

image

రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం ఐడిఓసి మందిరంలో అభినందించారు. హైదరాబాద్ దోమలగూడ గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఈనెల 17న సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో గద్వాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. విష్ణు అనే విద్యార్థి లాంగ్ జంప్ లో మొదటి స్థానం, షాట్ పుట్‌లో రెండో స్థానం సాధించాడు.

News February 18, 2026

తిన్న తర్వాత 10 నిమిషాల నడకతో షుగర్ వ్యాధికి ఫుల్ స్టాప్!

image

భోజనం తర్వాత 10 ని.లు నడిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని లైఫ్‌స్టైల్ కోచ్‌లు అంటున్నారు. ఈ చిన్న అలవాటు రక్తంలో షుగర్ లెవెల్స్ సడన్‌గా పెరగకుండా కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇన్సులిన్ రెస్పాన్స్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఎటువంటి ఖర్చు లేకుండా ఎక్కడైనా చేయగలిగే ఈ 10 నిమిషాల నడక దీర్ఘకాలంలో టైప్-2 డయాబెటిస్ ముప్పును తప్పిస్తుంది.