News May 7, 2025
కర్నూలు: ‘నూనెగింజల ఉత్పత్తికి ప్రోత్సాహం’

కర్నూలు జిల్లాలో నూనె గింజల ఉత్పత్తి పెంపుకు జేసీ డా.బి.నవ్య అధికారులకు సూచనలు ఇచ్చారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ జేసీ ఛాంబర్‌లో ఆయిల్ సీడ్స్ కన్వర్జెన్సీ సమావేశంలో జేసీ మాట్లాడారు. క్రిషోన్నతి పథకం కింద 5 ఏళ్లలో ఉత్పత్తి పెంచాలని, 1000 హెక్టార్ల భూమిలో పంటలు సాగు చేసి, రైతులను క్లస్టర్లుగా ప్రోత్సహించాలని సూచించారు. ఎఫ్‌పీఓల ద్వారా విత్తనాలు, లోన్లు, శిక్షణ అందించాలని ఆదేశించారు.
Similar News
News February 9, 2026
కర్నూలు: ‘37 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు’

కర్నూలు(D) వెల్దుర్తి జడ్పీ హైస్కూల్ (1988-89 బ్యాచ్) 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. దాదాపు 100 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. అలాగే పలు కారణాలతో మృతి చెందిన మిత్రులకు మౌనం పాటించి, నివాళులర్పించారు. వివిధ రంగాల్లో స్థిరపడిన మిత్రులను ఘనంగా సన్మానించారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు స్మరించున్నారు.
News February 9, 2026
కర్నూలు: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. రేపు ఇంటర్వ్యూ!

ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 10న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. 11 కంపెనీలు పాల్గొంటాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-35 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని చెప్పారు.
News February 9, 2026
103 మంది విద్యార్థులు హాజరు కాలేదు: లాలప్ప

జిల్లా వ్యాప్తంగా 61 పరీక్షా కేంద్రాలలో ఆదివారం జరిగిన ఇంటర్ జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప వెల్లడించారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరంలో 2,721 మంది విద్యార్థులు హాజరవ్వగా.. 82 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరంలో 1,968 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, 21 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని పేర్కొన్నారు.


