News August 20, 2025

కర్నూలు: మృతిచెందిన ఆరుగురు చిన్నారులు వీరే..!

image

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలిలో <<17465047>>ఆరుగురు చిన్నారులు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. స్కూల్ వదిలిన తర్వాత ఏడుగురు ఈత కోసం నీటి గుంత వద్దకు వెళ్లారు. ఆరుగురు ఈతకు దిగగా ఒకరు ఒడ్డున నిలబడ్డాడు. నీటిలో ఆరుగురు మునిగిపోవడంతో ఒడ్డున ఉన్న విద్యార్థి గ్రామంలోకి వెళ్లి పెద్దలకు చెప్పాడు. వాళ్లు వచ్చేలోపే ఆరుగురూ చనిపోయారు. మృతులు శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమ, వీరేంద్ర, మహబూబ్‌గా గుర్తించారు.

Similar News

News January 15, 2026

వికారాబాద్: అంగన్వాడీల్లో ఇన్ని ఖాళీ పోస్టులా?

image

VKB జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా, టీచర్ల కొరత వేధిస్తోంది. కొడంగల్ ప్రాజెక్టులో 234 కేంద్రాలు ఉండగా.. 73 ఆయా, 14 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మర్పల్లి 148 కేంద్రాలు ఉండగా.. 41 ఆయా, 30 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరిగి ప్రాజెక్టులో 235 కేంద్రాలు ఉండగా.. 112 ఆయా, 21 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వికారాబాద్ ప్రాజెక్టులో 233 కేంద్రాలు ఉండగా.. 82 ఆయా, 18 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

News January 15, 2026

NLG: వర్గపోరుతో ఎవరికి లాభం చేకూరేనో!

image

మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాలో వర్గపోరు పార్టీల్లో గందరగోళం సృష్టిస్తోంది. BJP పుంజుకుంటున్న తరుణంలో వర్గపోరు నేతలకు తలనొప్పిగా మారగా, కాంగ్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, DCC అధ్యక్షుడు పున్నా కైలాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయని పార్టీలో చర్చ నడుస్తోంది. మరోవైపు కార్పొరేషన్‌ తమదే అంటూ BRS వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్లో విజయం ఎవరిదో కామెంట్ చేయండి.

News January 15, 2026

చిత్తూరు ఎస్పీకి నోటీసులు

image

చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలైన కవిత మృతి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయవాది అర్షద్ అయుబ్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్న సంబంధిత అధికారులు ఈనెల 21న కమిషన్ ముందు హాజరై నివేదికను అందజేయాల్సి ఉంది.