News November 19, 2025

కర్నూలు: రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగాలు

image

ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. డిప్లొమా/ఐటీఐ అర్హతతో 24 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఉద్యోగానికి ఎంపికైతే వార్షిక వేతనం రూ.3 లక్షలు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు www.ncs.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News January 15, 2026

ఫోన్ ఎత్తుకెళ్లిన బెంగాల్ సీఎం.. సుప్రీంకోర్టులో ఈడీ

image

వెస్ట్ బెంగాల్ ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టులో వాడీవేడీగా విచారణ జరిగింది. సోదాల సమయంలో WB సీఎం మమతా తమ ఫోన్‌ను ఎత్తుకెళ్లినట్లు ఈడీ అధికారులు SCకి తెలియజేశారు. మనీలాండరింగ్ విషయమై సోదాల గురించి ముందే స్థానిక PSకు సమాచారమిచ్చినా పోలీసులతో మమతా తమ సోదాలకు అంతరాయం కలిగించారన్నారు. అటు పోలీసులను మమత నియంత్రించడం తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు పరిగణించింది.

News January 15, 2026

పొద్దుతిరుగుడు నాటిన తర్వాత కలుపు నివారణ

image

పొద్దుతిరుగుడు విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్30% E.C రసాయనాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30-40 రోజుల దశలో అంతరకృషి చేయాలి. ఇది సాధ్యం కాకపోతే గడ్డి జాతి కలుపు నివారణకు ఎకరాకు 400ml క్విజాలొఫాప్ ఇథైల్ 5% ఇ.సి. లేదా ప్రొపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250mlను 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు 2-4 ఆకుల దశలో పిచికారీ చేయాలి.

News January 15, 2026

ఏటూరునాగారం: ఇద్దరు మావోయిస్టు సభ్యులు లొంగుబాటు

image

ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ ఎదుట ఇద్దరు మావోయిస్టు లొంగిపోయారు. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారు. మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధి బందిపార గ్రామానికి చెందిన కుడియం పాండు, టెర్రం పోలీస్ స్టేషన్ పరిధి పెద్దిబట్టిగూడెంకు చెందిన ముచ్చక్కి మంగల్ మద్దెడు ఏరియా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సరెండర్ పాలసీలో భాగంగా వారికి రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.