News June 18, 2024

కర్నూలు: రైతుల అకౌంట్‌లోకి పీఎం కిసాన్ పెట్టుబడి సాయం

image

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఖరీప్ సీజన్ ప్రారంభం మే నెలలో కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.2వేల చొప్పున పెట్టుబడి సాయం చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అది వాయిదా పడింది. కాగా ఆ పెట్టుబడి సాయం కేంద్ర ప్రభుత్వం ఇవాళ అందించనుంది. కర్నూలు జిల్లాలో 2.34లక్షల మంది రైతులకు రూ.46.97 కోట్లు, నంద్యాల జిల్లాలో 1.95లక్షల మంది రైతులకు రూ.39.19కోట్లు రైతుల అకౌంట్‌లోకి జమ కానుంది.

Similar News

News January 17, 2026

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు యువతి

image

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు బి.క్యాంప్‌కు చెందిన శ్రీహిత ఎంపికైనట్టు శిక్షకులు పాలు విజయకుమార్, బ్రహ్మ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈనెల 21న నుంచి 28వ తేదీ వరకు మణిపూర్‌లో జరిగే అండర్-19 ఎస్జీఎఫ్ఐ ఫుట్‌బాల్ పోటీలలో శ్రీహిత పాల్గొంటుందని పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో ఎమ్మిగనూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు.

News January 17, 2026

మళ్లీ చెప్పున్నా.. జాగ్రత్త: కర్నూలు ఇన్‌ఛార్జ్ ఎస్పీ

image

ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్‌ నేరగాళ్లు SMలో ఫేక్‌ లింకులు పంపి మోసం చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను డీఐజీ, కర్నూలు ఇన్‌ఛార్జ్‌ ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ హెచ్చరించారు. పీఎం కిసాన్‌, ముద్ర లోన్స్‌, సూర్యఘర్‌, అమ్మఒడి వంటి పథకాల పేరుతో వచ్చే లింకులను క్లిక్‌ చేయవద్దన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దన్నారు. అనుమానాస్పద కాల్స్‌, లింకులు వస్తే 1930కు ఫోన్‌ చేయాలన్నారు.

News January 16, 2026

పాణ్యం మండలంలో విషాదం

image

పాణ్యం మండలం తమ్మరాజుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని రత్నమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందారు. హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొని ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆమె ఫుట్‌పాత్‌పై పడి తీవ్ర గాయంతో మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.