News July 6, 2024
కర్నూలు: రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

మంత్రాలయం రోడ్డు (తుంగభద్ర) రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పద్మ అనే మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే శాఖ ఎస్సై నరసింహ మూర్తి తెలిపారు. మంత్రాలయం రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన పద్మకు కర్ణాటకలోని అడివి కానాపురానికి చెందిన వీరేశ్‌తో వివాహం జరిగింది. పద్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన కర్ణాటక ప్రాంతంలో జరిగడంతో అక్కడి పోలీసులే కేసు నమోదు చేశారన్నారు.
Similar News
News December 7, 2025
కర్నూలు: ‘స్క్రబ్ టైఫస్.. వ్యాధి కాదు’

స్క్రబ్ టైఫస్ వ్యాధి కాదని, మనిషి నుంచి మనిషికి వ్యాపించదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై వైద్య బృందంతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 44 పాజిటివ్ కేసులు వచ్చాయని, అందరికీ చికిత్స అందించామని, 39 మంది రోగులను డిశ్చార్జ్ చేశామని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు వివరించారు.
News December 7, 2025
ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది: డీఈవో

పదో తరగతి ఫలితాల కోసం ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్స్ తరగతులను శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పాఠ్యాంశాలపై అవగాహన కల్పించి, పాఠాలు పూర్తిగా నేర్పే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. ప్రతీ పాఠశాలలో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.
News December 7, 2025
ట్రేడర్లు ఎంఎస్‌పీ కన్నా తక్కువకు కొనరాదు: కలెక్టర్

రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా మొక్కజొన్నను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400 తగ్గకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి ట్రేడర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తూకాలలో లోపాలు, మోసాలు జరగకుండా పరిశీలనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రవాణా ఛార్జీలు అధికంగా ఉండటం వల్ల కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చర్యలు చేపట్టామన్నారు.


