News December 2, 2025

కర్నూలు రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలివే.!

image

కర్నూలు హైవే-44 సంతోశ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద మంగళవారం <<18451272>>ఘోర రోడ్డు ప్రమాదం<<>> చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా అక్కడ మృతి చెందినవారి వివరాలను పోలీసులు తెలిపారు. మృతులు గూడూరుకి చెందిన మాలకమతల చంద్రమోహన్(32), మాల సుమన్(30)గా పోలీసులు గుర్తించారు. కాగా గాయపడిన మాల నవీన్ (33)ది ఎమ్మిగనూరు. అయితే వీరు కూలీ పనులతో జీవనం సాగించేవారని కుటుంబసభ్యులు తెలిపారు.

Similar News

News February 17, 2026

పన్నుల వసూళ్లలో పురోగతి సాధించాలి: కలెక్టర్ ఆదేశం

image

ఆస్తి, నీటి పన్నుల వసూళ్లలో మున్సిపల్ అధికారులు మరింత పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ట్రేడ్ లైసెన్సులు, భవన అనుమతులు, పెండింగ్ లేఅవుట్ పర్మిషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు మున్సిపల్ కమిషనర్లు పాల్గొని తమ పరిధిలోని పురోగతిని వివరించారు.

News February 17, 2026

రమేశ్ కుటుంబానికి మందకృష్ణ మాదిగ పరామర్శ

image

తుగ్గలి మండలం బొందిమడుగులలో దారుణ హత్యకు గురైన రమేశ్ కుటుంబాన్ని మంగళవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. దళిత నాయకుడి హత్యను ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ అట్రాసిటీ కేసు అమలు పరచాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

News February 17, 2026

కర్నూలులో 65 ఫిర్యాదుల స్వీకరణ

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 65 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భూ ఆక్రమణ, ఉద్యోగ మోసాలు, లోన్ మోసాలు, బెదిరింపులపై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, సీఐలు పాల్గొన్నారు.