News April 3, 2024

కర్నూలు: ‘వైసీపీ నేతలను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి’

image

వైసీపీ నేతలను అకారణంగా కొట్టిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కలిసి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సిలింగ్ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా విచక్షణా రహితంగా చేయి చేసుకోవడంపై మండిపడ్డారు.

Similar News

News February 10, 2026

మహా శివరాత్రికి శైవక్షేత్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, డీఎస్పీలు, తహశీల్దార్లు, ఎండోమెంట్స్ అధికారులతో సమీక్షించారు. దేవాలయాల్లో పారిశుద్ధ్యం, క్యూలైన్లు, బ్యారికేడింగ్, తాగునీరు, షేడ్‌లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

News February 10, 2026

పీహెచ్సీల్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

image

పీహెచ్సీల్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి వాట్సప్ గవర్నెన్స్‌పై అధికారులతో సమీక్ష ద్వారా మాట్లాడారు. వాట్సప్ గవర్నెన్స్‌లో ఈ నెల కూడా జిల్లా మొదటి స్థానంలో ఉండాలని అన్నారు. నాలుగు రోజుల్లోపు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News February 10, 2026

డ్రోన్ పెట్రోలింగ్‌తో కర్నూలు పోలీసుల స్మార్ట్ నిఘా

image

కర్నూలు జిల్లాలో నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ జిల్లా పోలీసు శాఖ డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించింది. డీజీపీ కార్యాలయం నుంచి కేటాయించిన 3 నూతన డ్రోన్ కెమెరాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆవిష్కరించారు. డే, నైట్ విజన్ సౌకర్యంతో పనిచేసే ఈ డ్రోన్లు జిల్లావ్యాప్తంగా నిరంతర నిఘా నిర్వహించనున్నాయి. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కాలేజీలు, పాఠశాలల ప్రత్యేక నిఘాకు ఉపయోగపడతాయన్నారు.