News November 11, 2024

కర్నూలు: 1988-1993 పూర్వ విద్యార్థుల సమ్మేళ్లనం

image

తుగ్గలి మండలం పెండేకల్ (ఆర్.ఎస్.) జెడ్.పి.హెచ్.యస్ లో 1988-1993 వరకు చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. గురువుల సమక్షంలో సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తమతో పాటు విద్యను అభ్యసించి మృతి చెందిన 9 మంది విద్యార్థులను స్మరించుకొని వారికి నివాళులర్పించారు. పాఠశాలకు ప్రింటింగ్ ప్రెస్ జిరాక్స్ మిషన్‌ను బహుకరించారు.

Similar News

News December 12, 2024

మహానందిలో భక్తజన సందడి

image

మహానంది ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం ఆలయ ప్రాంగణంలో వివాహాలు ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులు స్థానిక రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరులలో స్నానాలు ఆచరించారు. అయ్యప్ప స్వామి దీక్ష దారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులందరూ సాధారణ, ప్రత్యేక, స్పర్శ దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

News December 12, 2024

నంద్యాల MP ప్రశ్న.. సమాధానం ఇచ్చిన కేంద్రం!

image

నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార శాఖ సమాధానం ఇచ్చింది. మహిళలను సోషల్ మీడియా వేధింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవచ్చా? అని ఎంపీ ప్రశ్నించారు. దీనికి కేంద్రం సమాచార శాఖ రిప్లై ఇచ్చింది. ‘సోషల్ మీడియాలో మహిళలను వేధించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. సైబర్ నేరాలకు పాల్పడే వారినీ చట్టప్రకారం శిక్షించొచ్చు’ అని స్పష్టం చేసింది.

News December 12, 2024

డోన్‌లో మెషీన్‌లో ఇరుక్కుని మహిళ మృతి

image

డోన్‌లోని కోట్లవారి పల్లె సమీపాన రోజు కూలికి వెళ్లే మహిళ ఫ్యాక్టరీ పల్వరైజర్ మెషీన్‌లో ఇరుక్కుని మృతి చెందింది. మృతురాలు డోన్ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన లోకేశ్వరమ్మగా స్థానికులు గుర్తించారు. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. మహిళ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.