News May 12, 2024
కర్లపాలెం ఎస్సై జనార్దన్ సస్పెన్షన్

కర్లపాలెం <<13230471>>ఎస్సై జనార్దన్‌ను సస్పెండ్<<>> చేస్తూ బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కర్లపాలెం పోలీస్ స్టేషన్‌లో టీడీపీ కార్యకర్తపై జరిగిన దాడి విషయంలో ఘటనకు ఎస్సై పరోక్షంగా కారణమయ్యాడనే నెపంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పోలీస్ సిబ్బంది ప్రవర్తిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 10, 2025
గుంటూరు: ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్‌గా కరుణ

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పరిశీలకురాలిగా వి.కరుణ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం గుంటూరు కలెక్టరేట్‌ను ఆమె సందర్శించారు. కలెక్టర్ నాగలక్ష్మీ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, నామినేషన్లతో పాటూ ఇతర వివరాలను ఎన్నికల పరిశీలకురాలికి కలెక్టర్ వివరించారు.
News February 10, 2025
గుంటూరు: LLB పరీక్షల ఫలితాల విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్- 2024లో నిర్వహించిన LLB 2వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. LLB కోర్సు పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.
News February 10, 2025
కాకుమానులో ప్రమాదాలు.. ఇద్దరి మృతి

కాకుమాను మండలంలో సోమవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న ట్రాక్టర్‌ని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో బైకుపై ఉన్న వ్యక్తి ఘటన స్థలంలో మృతి చెందాడు. మండలంలోని కొండపాటూరు గ్రామంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు క్రాంతి కుమార్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.