News March 16, 2025
కలకత్తా నుంచి కన్యాకుమారికి సైకిల్ ర్యాలీ

సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు 6,500 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం గుండా సైకిల్ ర్యాలీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ ర్యాలీ శనివారం రాత్రి ఆంధ్ర రాష్ట్రంలోకి విచ్చేసిన సందర్భంగా కంచిలిలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. భారతమాతాకి జై అంటూ వారు నినాదాలు చేశారు. ఈ ర్యాలీ పాల్గొన్న 60 మందిని సత్కరించారు.
Similar News
News February 7, 2026
ఎచ్చెర్ల: అందుబాటులో 16 పీజీ కోర్సులు

పీజీ కోర్సుల ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు మార్చి 11లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో గత ఏడాది 16 కోర్సుల్లో ప్రవేశాలు జరిగాయి. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు ఈ పీజీ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బిడ్డికి అడ్డయ్య కోరారు.
News February 7, 2026
అర్హత గల ప్రతి పేదవానికి పక్కా ఇల్లు నిర్మిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో అర్హతగల ప్రతి పేదవానికి పక్కాఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం సంతబొమ్మాళి మండలం నౌపడ కూడలి వద్ద పేదలకు ఇళ్ల పట్టాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేసారు. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే CM ధ్యేయం అన్నారు. ఆర్‌డీఓ ఎం.కృష్ణమూర్తి, AMC ఛైర్మన్ బీ.వెంకటరమణమ్మ, తహశీల్దార్ హేమసుందర్ రావు పాల్గొన్నారు.