News March 27, 2024

కలిసికట్టుగా పని చేస్తే విజయం మనదే: అత్రం సక్కు

image

బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేస్తే విజయం సాధిస్తామని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. ఘనపూర్, ఉట్నూర్ గ్రామంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మాట్లాడారు. ప్రతి ఒక్క కార్యకర్త కలిసికట్టుగా పని చేస్తే విజయం తథ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్రా జైవంత్ రావు ఉన్నారు.

Similar News

News February 13, 2026

ఉట్నూర్: 4KGల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్

image

నమ్మదగిన సమాచారంతో ఇంద్రవెల్లి పోలీసులు శ్మశానవాటిక వద్ద నిఘా ఉంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కొడప రమేష్, కుంర గంగారం, కుముర కృష్ణల వద్ద నుంచి 4కిలోల గంజాయి, మోటార్ సైకిల్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను ఉట్నూర్ కోర్టులో రిమాండ్ చేసినట్లు ఎస్ఐ సాయన్న వెల్లడించారు.

News February 13, 2026

సిబ్బందికి శుభాకాంక్షలు: ఆదిలాబాద్ కలెక్టర్

image

జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బంది క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసి మొత్తం ప్రక్రియను సాఫీగా పూర్తి చేశారని ఆయన అభినందించారు. మద్దతు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కౌంటింగ్‌లో పాల్గొన్న సిబ్బంది, భద్రతా సిబ్బంది, సంబంధిత అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

News February 13, 2026

విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవు: ADB DSP

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఫలితాల వేళ డీఎస్పీ జీవన్ రెడ్డి ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, టపాకాయలు పేల్చడం నిషేధమని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రం, ప్రధాన చౌరస్తాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. ప్రజలు గుమిగూడరాదని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని, పోలీసులకు సహకరించాలని కోరారు.