News September 10, 2025

కలెక్టరేట్‌ను ముట్టడించిన మాజీ ఎంపీ సీతారాం నాయక్

image

మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీ నాయకులతో కలిసి బుధవారం ములుగు జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లాలోని స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం, కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించేందుకు ఎంపీతో పాటు కొందరు నాయకులను పోలీసులు అనుమతించారు.

Similar News

News December 10, 2025

జిల్లా అభివృద్ధిలో రహదారుల నిర్మాణం కీలకం: కలెక్టర్

image

జాతీయ రహదారుల నిర్మాణం బాగుంటే బాపట్ల జిల్లా అభివృద్ధి పట్టాలపై పయనిస్తుందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై కలెక్టర్ బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. అన్నిప్రాంతాలకు రవాణా సౌకర్యం, రహదారులు మెరుగ్గా ఉంటే అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సీ, సంక్షేమ సాధికారత అధికారిణి రాజదిబోరా పాల్గొన్నారు.

News December 10, 2025

ధర్మపురి: అక్కడ పాలకవర్గం అంతా ఏకగ్రీవమే

image

ధర్మపురి మండలంలోని బొదరి నక్కల చెరువు గూడెంలో సర్పంచ్‌తో పాటు అక్కడ ఉన్న ఆరు వార్డులలో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్‌గా గోపు రాజన్న ఒక్కడే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఆరు వార్డులలో ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం ఉండదికా.

News December 10, 2025

కానిస్టేబుల్ శిక్షణ ఏర్పాట్లు పరిశీలించిన కడప SP

image

ఇటీవల నూతనంగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుల్స్‌కు త్వరలో శిక్షణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కడప నగర శివారులోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం జిల్లా ఎస్పీ నచికేత్ పరిశీలించారు. అక్కడ శిక్షణ కేంద్రంలోని తరగతి గదులు, మైదానం, కిచెన్ తదితరాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.