News September 10, 2025
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం: లక్ష్మీశా

నేపాల్‌లో చిక్కుకున్న ఎన్టీఆర్ జిల్లా వాసులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. 91549 70454 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. కాగా 261 మంది తెలుగువారు నేపాల్‌లో చిక్కుకున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది. ఖాట్మండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ద్వారా వారిని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.
Similar News
News December 7, 2025
మూడు విడతలు పూర్తయ్యే వరకు కోడ్ అమలు: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలు ముగిసే వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని గఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున, చివరి దశ పూర్తయ్యే వరకు కోడ్ కొనసాగుతుందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా కోడ్ వర్తిస్తుందని, ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 7, 2025
నరసరావుపేటలో కేజీ చికెన్ ధర ఎంతంటే.!

నరసరావుపేటలో గత వారంతో పోలిస్తే ఈ ఆదివారం కేజీ చికెన్ ధర రూ. 20 నుంచి రూ. 30 వరకు పెరిగింది. లైవ్ కోడి కేజీ రూ. 135 ఉంది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కేజీ స్కిన్ లెస్ రూ. 240-280 ఉండగా స్కిన్‌తో రూ. 230-260 లభిస్తుంది. మటన్ కేజీ ధర రూ. 800-900 అందుబాటులో ఉంది. 100 కోడిగుడ్లు రూ. 670 అమ్ముతున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News December 7, 2025
సంగారెడ్డి: బాబోయ్.. మళ్లీ చలి

ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్లీ చలిపంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లాలోనే అత్యల్పంగా కోహీర్ మండలంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట(D) అంగడికిష్టాపూర్‌లో 10.6 డిగ్రీలు, మెదక్(D) నార్లాపూర్‌లో 11.2 డిగ్రీలు నమోదయ్యాయి. చల్ల గాలుల ప్రభావంతో రానున్న పది రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని, అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.


