News November 30, 2025
కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

డిసెంబర్ 1వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.
Similar News
News February 13, 2026
ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్ ఇస్తుందా?

T20 WCలో జింబాబ్వేపై రికార్డు ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది. ఈ రెండు జట్లు 2007లో తలపడిన మ్యాచులో ZIMనే విజయం సాధించడం దీనికి కారణం. 19 ఏళ్ల తర్వాత ఇరు జట్లు ఇవాళ ఉ.11 గంటలకు తలపడనున్నాయి. ఈ టోర్నీలో AUS, జింబాబ్వే చెరో విజయంతో గ్రూప్-Bలో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. మరి ఈ మ్యాచులో ఆస్ట్రేలియాకు ZIM మరోసారి షాక్ ఇస్తుందా? లేదా AUS ఆధిపత్యం కొనసాగిస్తుందో చూడాలి.
News February 13, 2026
కర్నూలు విద్యార్థిని మృతి.. రూ.262 కోట్ల పరిహారం

అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన కర్నూలు విద్యార్థిని జాహ్నవి(23) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (సుమారు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్ సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన జాహ్నవి 2023 జనవరి 3న రాత్రి రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది.
News February 13, 2026
కౌంటింగ్ కేంద్రాల్లోకి ఈ వస్తువులు నిషేధం: కామారెడ్డి SP

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు పాటించాలని కామారెడ్డి SP రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే వారు అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంక్ బాటిల్స్, పేలుడు కారణమయ్యే వస్తువులు తీసుకురాకూడదని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీస్ సిబ్బందికి అభ్యర్థులు, ఏజెంట్లు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.


