News August 6, 2024
కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న నెల్లూరు కలెక్టర్

రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మొదటిసారి జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశంలో నెల్లూరు కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పరిధిలోని పలు అభివృద్ధి పనులు పెండింగ్ కార్యక్రమాల గురించి ఆయన కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
Similar News
News December 17, 2025
నెల్లూరు: మేము ‘సై’.. కానీ మా ప్రాణాలకు రక్షనుందా.!

గంజాయి నిర్మూలనకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. యువత సైతం ముందుకు రావాలని DSP ఘట్టమనేని కోరారు. నగదు ప్రోత్సాహాన్ని సైతం ఆఫర్ చేస్తున్నారు. గంజాయి సమాచారం ఇస్తాం.. మరి మా ప్రాణాలకు రక్షణ ఇవ్వగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారట. పెంచలయ్య హత్యను వారు ఉదహరిస్తున్నారు. గంజాయికి వ్యతిరేకంగా మాట్లాడిన ఓ యువతి సైతం అనంతరం ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. మరి పోలీసులు యువతకు భరోసా ఇస్తారా.? చూడాలి.
News December 17, 2025
నెల్లూరు: మేము ‘సై’.. కానీ మా ప్రాణాలకు రక్షనుందా.!

గంజాయి నిర్మూలనకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. యువత సైతం ముందుకు రావాలని DSP ఘట్టమనేని కోరారు. నగదు ప్రోత్సాహాన్ని సైతం ఆఫర్ చేస్తున్నారు. గంజాయి సమాచారం ఇస్తాం.. మరి మా ప్రాణాలకు రక్షణ ఇవ్వగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారట. పెంచలయ్య హత్యను వారు ఉదహరిస్తున్నారు. గంజాయికి వ్యతిరేకంగా మాట్లాడిన ఓ యువతి సైతం అనంతరం ఆందోళన చెందినట్లు తెలస్తోంది. మరి పోలీసులు యువతకు భరోసా ఇస్తారా.? చూడాలి.
News December 16, 2025
మామా.. మన నెల్లూరును మనమే క్లీన్ చేసుకుందాం..!

నెల్లూరులో పదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి వ్యాపారాన్ని స్థానికుల సమాచారంతో పోలీసులు అడ్డుకున్నారు. సిటీలో గంజాయి నిర్మూలనకు యువత ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఎక్కడన్నా గంజాయి వ్యాపారాలు సాగుతుంటే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నగదు సైతం ఇస్తామని ప్రకటించారు. యువత గంజాయి వాడకానికి దూరంగా ఉంటే క్రైం తగ్గుతుందని పోలీసులు పేర్కొన్నారు. మీ COMMENT.


