News November 19, 2025
కలెక్టర్ హెచ్చరిక

ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేసి వారికి రసీదు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తహశీల్దార్లతో పలు రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.
Similar News
News January 17, 2026
కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ రిజర్వేషన్ల నగారా.. ఎవరికి ఏ పీఠం?

కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఛైర్మన్ పీఠాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించిన జాబితా ప్రకారం.. కామారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలు బీసీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. కొత్తగా ఏర్పడిన బిచ్కుంద పీఠం బీసీ జనరల్‌కు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ జనరల్ కేటగిరీకి దక్కాయి. రిజర్వేషన్లు వెలువడటంతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
News January 17, 2026
కొత్తగూడెం: పారదర్శకంగా మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు: కలెక్టర్

కొత్తగూడెం కార్పొరేషన్, అశ్వరావుపేట, ఇల్లందు మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్లను శనివారం కలెక్టరేట్‌లో లాటరీ పద్ధతిలో ఖరారు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకతతో రిజర్వేషన్లను కేటాయించినట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. నిష్పక్షపాతంగా వార్డుల ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
News January 17, 2026
U-19WC: భారత్ స్కోర్ ఎంతంటే?

U-19 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత్ 238 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మన జట్టులో కెప్టెన్ ఆయుష్ మాత్రే(6) మరోసారి ఫెయిల్ అయ్యారు. మరో ఓపెనర్ సూర్యవంశీ 72, అభిజ్ఞాన్ కుందు 80 రన్స్‌తో రాణించారు. మధ్యలో వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచును 49 ఓవర్లకు కుదించారు. మరి భారత్ ఈ టార్గెట్‌ను కాపాడుకుంటుందా? COMMENT


