News October 6, 2025

కల్తీ మద్యం.. అసలు విలన్ చంద్రబాబు: YCP

image

ములకలచెరువులో కల్తీ మద్యం ఘటనపై CM చంద్రబాబుకి అంతా తెలుసని X వేదికగా YCP ఆరోపించింది. ‘MLA అభ్యర్థిగా శంకర్ యాదవ్‌‌‌ను చివరి నిమిషయంలో తప్పించి ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేస్తున్న జయచంద్రారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారు, TDP పెద్దల అండదండలు లేకుండానే ములకలచెరువులో ఇంత పెద్ద నకిలీ లిక్కర్ ప్లాంట్‌ను నడిపై ధైర్యం ఎవరికైనా ఉంటుందా’ అని ప్రశ్నించింది. ఇందులో అసలు విలన్ చంద్రబాబేనని ట్వీట్ చేసింది.

Similar News

News January 22, 2026

భద్రాచలం: ఐటీడీఏ ఉద్యోగులకు ఈనెల 23న క్రీడా పోటీలు

image

భద్రాచలం ఐటీడీఏ పరిధిలో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మొట్టమొదటిసారిగా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ గురువారం తెలిపారు. ఈనెల 23, 24వ తేదీల్లో కిన్నెరసానిలోని ప్రభుత్వ మోడల్ క్రీడా పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు. శారీరక ఉల్లాసం పొందడం, పని ఒత్తిడి తగ్గించడం, ఉద్యోగి ఆరోగ్యంగా ఉండడంతోపాటు ఐక్యత స్నేహభావం కలిగి ఉండడానికి క్రీడలు దోహదపడతాయన్నారు.

News January 22, 2026

విశాఖ: ఫిబ్రవరిలో ఆర్సెల్లార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

image

అనకాపల్లి(D) నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌కు ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన చేయనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సందర్భంగా ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్తో సీఎం భేటీ అయ్యారు. రూ.60 వేల కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

News January 22, 2026

రోడ్డు మీద వెళ్తుంటే డబ్బు దొరికిందా?

image

రోడ్డుపై వెళ్తుంటే డబ్బు దొరకడం యాదృచ్చికం కాదని, భగవంతుడి సంకేతమని జ్యోతిషులు చెబుతున్నారు. ‘నాణెం దొరికితే కొత్త పనుల్లో విజయం, ఆర్థిక లాభాలు సిద్ధిస్తాయి. నోటు దొరకడం లక్ష్మీదేవి కటాక్షానికి సూచిక. ఇలా దొరికిన సొమ్మును ఖర్చు, దానం చేయకూడదు. దైవ ప్రసాదంగా భావించి, పర్సు/పూజా గదిలో భద్రపరచాలి. తద్వారా మనిషికి/ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఉదయం వేళ డబ్బు దొరకడం రెండింతలు అదృష్టం’ అంటున్నారు.