News October 6, 2025

కల్తీ మద్యం కేసు.. కీలక TDP నేతలు ఔట్.!

image

రాష్ట్రంలో సంచలనం రేపిన ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లి TDP నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దాసరపల్లి జై చంద్రారెడ్డిని CM చంద్రబాబు ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఈ కేసులో నిందితుడుగా ఉన్న పీటీ మండలం మల్లెలకు చెందిన కట్ట సురేంద్ర నాయుడును సైతం పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News January 19, 2026

ఎమ్మిగనూరు: విషాదం.. తల్లీకూతురి మృతి

image

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట(M) జానంపేట సమీపంలోని NH-44పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మిగనూరుకు చెందిన తల్లీకూతురు రాధ (42), లక్ష్మీదుర్గ (8) అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ఆటో, బొలెరో వాహనాలు ఢీకొట్టి అనంతరం అవతలి రోడ్డుపై ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News January 19, 2026

VKB: ధారాళంగా కారుతున్న వేపకల్లు.. ఎక్కడో తెలుసా!

image

ఈత చెట్టుకో.. తాటి చెట్టుకో కల్లు కారడం సహజంగా చూస్తూ ఉంటాం.. కానీ వేప చెట్టుకు దారాళంగా రోజుకు మూడు లీటర్ల వరకు కల్లు కారుతున్న అద్భుత దృశ్యం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హస్నాబాద్ గ్రామంలోని చావిడి దగ్గర కనిపించింది. వేప కల్లు చేదు స్వభావాన్ని కలిగి ఉన్న సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని గ్రామస్థులు తెలిపారు.

News January 19, 2026

మెదక్: 346 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు!

image

మెదక్ పట్టణంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ జరిగింది. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని 346 సంఘాలకు రూ. 90.24 లక్షల చెక్కులతో పాటు చీరలను అందజేశారు. మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ రుణాలను చిన్న వ్యాపారాలు, పిల్లల చదువుల కోసం వినియోగించుకోవాలని ఆయన సూచించారు.