News October 7, 2025

కల్తీ మద్యానికి కర్త, కర్మ, క్రియ అంతా జగనే: పీతల సుజాత

image

పురాణాల్లో దేవుళ్లు మంచి పనులు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడినట్టు, సీఎం చంద్రబాబు మంచి పనులు చేస్తుంటే జగన్ అడ్డుపడుతున్నాడని ఏపీ డబ్ల్యూసీఎఫ్‌సీ ఛైర్మన్ పీతల సుజాత మండిపడ్డారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

Similar News

News January 23, 2026

నేటి గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు

image

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 38,000 బస్తాల సరుకు వచ్చింది. ఇందులో 28,000 బస్తాలు కొత్త పంట కాగా, 10,000 బస్తాలు ఏసీ నిల్వలు ఉన్నాయి. తేజా రకం ధర స్వల్పంగా తగ్గింది. గరిష్టంగా రూ.18,300 పలికినప్పటికీ, సగటున రూ.18,000 వద్దే లావాదేవీలు జరిగాయి. 341, డీడీ రకాలు రూ.24,000 నుండి రూ.24,500 వరకు అమ్ముడుపోయాయి. బ్యాడిగి ఏసీ రకం గరిష్టంగా రూ.30,000 వరకు పలికింది. ఆర్మూర్ రకం రూ.16,500 వద్ద నిలిచింది.

News January 23, 2026

గుంటూరు జిల్లాలో భారీ మోసం

image

నల్లపాడు GDCC బ్యాంకులో రూ.30కోట్ల పైగా ఆర్థిక మోసానికి పాల్పడిన 2 కేసుల్లో 5గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు ఛైర్మన్, ఉద్యోగులు, కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్, మిర్చి వ్యాపారులు, నకిలీ రైతులు మొత్తం 270మంది నిందితులుగా గుర్తించామని అన్నారు. బ్యాంక్ మేనేజర్ అరుణకుమారి, కమిటీ సభ్యుడు గోవింద్, మిర్చి వ్యాపారి రామచంద్రరావు, కోల్డ్ స్టోరేజ్ నాగిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి అరెస్టయ్యారు.

News January 23, 2026

గుంటూరు: ‘వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం’

image

గుంటూరు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో UPHCలు, PHCలలో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించినట్లు DMHO విజయలక్ష్మి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డీఈఓ, ఎఫ్‌ఎన్‌వో, శానిటరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫారములు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలు www.guntur.ap.gov.in‌లో అందుబాటులో ఉన్నాయి.