News August 20, 2025

కల్వకుర్తిలో 43.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటలలో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా కల్వకుర్తిలో 43.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. తిమ్మాజిపేటలో 28.8, బిజినపల్లిలో 22.0, అచ్చంపేటలో 19.6, లింగాలలో 18.6, ఉప్పునుంతలలో 16.2, పెద్దకొత్తపల్లిలో 15.0, పదరలో 14.4, అమ్రాబాద్ లో 14.2, వంగూరులో 13.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు పేర్కొన్నారు.

Similar News

News January 14, 2026

ఈ గ్రామంలో సంక్రాంతి పండుగే జరపరు

image

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మాములుగా ఉండదు. కానీ, అనంతపురం(D) పి.కొత్తపల్లి గ్రామంలో ఈ పండుగే చేయరు. ఈ మూడ్రోజులు ముగ్గులు వేయడం, ఇల్లు తుడవడం వంటి పనులేం చేయరు. విచిత్రమేంటంటే కొందరు స్నానాలు కూడా చేయరట. పూర్వం సంక్రాంతి సరుకుల కోసం సంతకు వెళ్లిన గ్రామస్తులు వరుసగా మరణించడంతో, ఈ పండుగ తమకు అరిష్టమని వారు నమ్ముతారు. అందుకే తరాలు మారినా నేటికీ అక్కడ పండుగ చేసుకోరు.

News January 14, 2026

GNT: కిటకిటలాడుతున్న సరస్ ప్రదర్శన ప్రాంగణం

image

గుంటూరులో జరుగుతున్న సరస్ మేళా-2026 అఖిల భారత డ్వాక్రా బజారుకు విశేమైన ఆదరణ లభిస్తోంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో సందర్శకులు స్టాళ్లను సందర్శిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన స్టాల్స్ మాత్రమే కాకుండా సందర్శకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ఉత్పత్తులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరిస్తున్నాయని సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News January 14, 2026

చిత్తూరుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

image

తవణంపల్లి: తెల్లగుండ్లపల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణం వందలూరు గ్రామానికి చెందిన కే. బుజ్జమ్మ (45) భర్త మురుగయ్య‌తో కలిసి బైకుపై చిత్తూరుకు వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బుజ్జమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, మురుగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మురుగయ్యను చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.