News July 28, 2024
కల్వకుర్తి: సీఎం రేవంత్ రెడ్డి హామీలపై ఆశలు..!
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఈరోజు మొదటిసారి కల్వకుర్తికి వస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిపై ఆశలు పెంచుకుంటున్నారు. కొన్ని ఏళ్లుగా నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు తీరుతాయని ప్రజలు ఆశలకు హద్దులు లేకుండా పోయింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌లో భూములు కోల్పోయి నేటికి పైసలు రాని భూ నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. పర్యటనలో CM ఎలాంటి హామీలు ఇస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News October 8, 2024
MBNR: ‘పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయండి’
చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విద్యార్థులు కోరుతున్నారు. స్కాలర్షిప్ రాలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే సాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందించాలని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని చెబుతున్నారు.
News October 8, 2024
మరికల్: రూ.11,11,111 నోట్లతో దుర్గామాత అలంకరణ
మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం 6వ రోజు అమ్మవారిని రూ. 11,11,111 కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, మంగళ హారతులు చేసి నైవేద్యం సమర్పించారు. గ్రామస్థులు దుర్గామాతను దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు.
News October 8, 2024
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రతలిలా…
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా గద్వాల జిల్లా వడ్డేపల్లి లో 35.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా సోలిపూర్ లో 32.7 డిగ్రీలు, నారాయణపేట జిల్లా కోటకొండ లో 31.7 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా కొల్లూరులో 30.0 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా పద్రాలో 29.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.