News December 1, 2025
కల్వకుర్తి: GPO ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినయ్

కల్వకుర్తిలో జరిగిన గ్రామ పాలనా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆవిర్భావ సభలో వినయ్‌ను నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొట్ర క్లస్టర్ జిపిఓగా పనిచేస్తున్న వినయ్, 2019లో TSPSC ద్వారా VROగా ఎంపికయ్యారు. ఉద్యోగుల సమస్యల కోసం కట్టుబడి పనిచేస్తారన్న నమ్మకంతో ఆయనను పదవికి ఎంపిక చేసినట్లుగా అధికారులు తెలిపారు. అనంతరం ఉద్యోగులు, మిత్రులు శాలువా కప్పి సన్మానించారు
Similar News
News February 10, 2026
నెల్లూరులో గీత దాటితే ఫైన్.. జాగ్రత్త!

నెల్లూరులో నూతన సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. DKW కళాశాల, KVR పెట్రోల్ జంక్షన్, VRC, కనకమహల్, రామలింగాపురం సహా ఏడు ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ పెట్టారు. వీటి పనితీరును కార్పొరేషన్ కమిషనర్ వై.ఓ నందన్ పరిశీలించారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే సిగ్నల్ వద్ద ఉన్న కెమెరాల్లో రికార్డు అవుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆ వాహనానికి ఫైన్ వేస్తారు. ఇదంతా మీకు తెలియకుండా జరుగుతుంది.
News February 10, 2026
తాబేలు ఉన్న ఉంగరాన్ని ధరిస్తే..?

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆర్థిక కష్టాలు తొలగి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి తాబేలు ఉంగరం ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. ‘ఈ ఉంగరాన్ని ముందుగా పాలు, గంగాజలంతో శుద్ధి చేయాలి. ముందుగా లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి పూజించాలి. గురువారం ఈ ప్రక్రియ పూర్తి చేసి, శుక్రవారం నాడు కుడిచేతి చూపుడు/మధ్య వేలుకు ధరించాలి. ఉంగరం పెట్టుకున్నప్పుడు తాబేలు ముఖం మీ వైపు ఉండేలా చూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News February 10, 2026
216 గంటల భరతనాట్యంతో ప్రపంచ రికార్డు

కర్ణాటకలోని ఉడిపికి చెందిన 23 ఏళ్ల విదుషి దీక్ష భరతనాట్యం చేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. 216 గంటల పాటు నిరంతరాయంగా భరతనాట్యం ప్రదర్శించి, తన 170 గంటల పాత రికార్డును బద్దలు కొట్టి, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. డాక్టర్ జి. శంకర్ మహిళా కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ ప్రదర్శన సమయంలో ప్రతి మూడు గంటలకు కేవలం 15 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటూ ఆమె ఘనతను సాధించారు.


