News February 7, 2025
కళ్యాణానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు: JC

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు జేసీ నిషాంతి తెలిపారు. శుక్రవారం కళ్యాణ వేదిక ఏర్పాట్లు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లు, మినీ కంట్రోల్ రూమ్, బీచ్ పాయింట్, స్నాన ఘట్టాలు ఆమె పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి 12.55 గంటలకు కళ్యాణం జరుగుతుందన్నారు. నాలుగు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని చెప్పారు.
Similar News
News February 11, 2026
శ్రీశైలంలో భక్తుల రద్దీ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. రా.12 గంటల నుంచి నేటి ఉ.7:42 వరకు 13,380 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వీరిలో కాలినడకన వచ్చిన వారు 5,928 మంది ఉన్నారు. రద్దీ కారణంగా ఇరుముడి కలిగిన శివస్వాములకు, అలంకార దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతోందని భక్తులు పేర్కొంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.
News February 11, 2026
అరకప్పు కాఫీకి కాడు అభివృద్ధి కోసం పని చేయండి: కడప కలెక్టర్

ప్రొద్దుటూరు అభివృద్ధి సమీక్షలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. అరకప్పు కాఫీ కోసం కాకుండా అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని పొద్దుటూరు మున్సిపల్ అధికారులకు చురకలు అంటించారు. ఇటీవల ప్రొద్దుటూరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు 1/2 టీ కోసం గొడవ పడి, హోటల్ ర్యాంప్ కూల్చివేతకు జేసీబీ తీసుకెళ్లారు. ఈ ఘటనపై ACP నాగరాజును సస్పెండ్, ఛైర్మన్ వెంకటేశ్వర్లును టెర్మినేట్ చేశారు.
News February 11, 2026
జనగామ 10.19%.. స్టేషన్ ఘన్పూర్ 11.53 % పోలింగ్

జనగామ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని అధికారులు విడుదల చేశారు. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 44,045 మంది ఓటర్లలో 4,489 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని 10.19 శాతం పోలింగ్ నమోదైంది. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 18,550 మంది ఓటర్లలో 2,138 మంది ఓటు వేయగా 11.53 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.


