News February 8, 2025
కశింకోట: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

కశింకోటలో ఓ యువకుడు అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరవాడ ఫార్మాసిటీలో పనిచేస్తున్న దుర్గాప్రసాద్(25) కసింకోటలో నివసిస్తున్నాడు. ఎన్టీఆర్(D) మైలవరానికి చెందిన దుర్గాప్రసాద్ ఆ గ్రామంలో ఇంటిని నిర్మించుకున్నాడు. ఇంటి నిర్మాణానికి చేసిన తప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఉరివేసుకుని సెల్ఫీ వీడియో కుటుంబ సభ్యులకు పంపించడంతో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
Similar News
News February 19, 2026
163 ఏళ్ల తర్వాత ఇలా.. మళ్లీ 2189లోనే!

ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతుల పండుగలు ఒకే సమయంలో రావడం చాలా అరుదు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్, క్రైస్తవ మతంలో ఈస్టర్ పండుగకు ముందు వచ్చే లెంట్, చైనీస్ ‘లూనార్ న్యూఇయర్’లు 1863లో 24 గంటల వ్యవధిలోనే ప్రారంభమయ్యాయి. మళ్లీ 163 ఏళ్ల తర్వాత 2026లో ఈనెల 17-18న ఇది ఆవిష్కృతమైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మళ్లీ ఇలాంటి వింతను చూడాలంటే 2189 వరకు వేచి చూడాలి.
News February 19, 2026
యాదాద్రి జిల్లాలో బ్యాంకు అధికారుల సమావేశం

భువనగిరిలోని మినీ మీటింగ్ హాల్లో కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం ఈజీపీ, పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి వంటి పథకాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ పథకాలకు సంబంధించిన రుణ ప్రక్రియను బ్యాంకు ఉద్యోగులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు సకాలంలో అందేలా బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.
News February 19, 2026
గుంటూరు మిర్చి యార్డులో సరకు రాక పెరుగుదల

గుంటూరు యార్డుకు మిర్చి టిక్కీల రాక బుధవారం పెరిగింది. మొత్తం 1,06,635 టిక్కీలు రైతులు తీసుకురాగా 1,02,831 విక్రయాలు జరిగాయి. నాణ్యతను బట్టి క్వింటాల్‌కు రూ.17,500 నుంచి రూ.24,500 వరకు ధర లభించింది. తక్కువ క్వాలిటీ సరకుకే ధర తగ్గిందని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. ఉదయం ఒప్పుకున్న ధరకే బిడ్డింగ్ చేయాలని అధికారులు కమిషన్ దుకాణాలకు సూచించారు. ఎగుమతి వ్యాపారులపై వచ్చిన ఫిర్యాదులపై పర్యవేక్షణ పెంచారు.


