News March 26, 2024

కశింకోట: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

కశింకోట మండలం జి భీమవరం వంతెన వద్ద మంగళవారం స్కూటీని టిప్పర్ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. అనకాపల్లి నుంచి నర్సీపట్నం వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలు రావికమతం మండలం గొల్లలపాలెంకు చెందిన ఎస్.లక్ష్మమ్మ(65)గా గుర్తించారు. ఇదే ప్రమాదంలో ఆమె అల్లుడు శృంగవరపు రాము గాయపడ్డాడు. కశింకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 13, 2026

గంగవరం పోర్టులో కనీసం బ్రేక్ వాటర్ నిర్మించండి: ఎమ్మెల్యే పల్లా

image

గంగవరం పోర్టు ఏర్పడిన తర్వాత ఇక్కడ జెట్టీ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. జెట్టీ లేక ఇక్కడి మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించారు. కనీసం బ్రేక్ వాటర్‌ను అయినా నిర్మించి స్థానిక మత్స్యకారులను ఆదుకోవాలని ఆయన కోరారు.

News February 13, 2026

విశాఖ: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

విశాఖ జిల్లాలోని ఎంజేపీ ఏపీ బీసీ గురుకులాల్లో 5వ తరగతి, 6-8 (బ్యాక్‌లాగ్), ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 4వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 12న 5వ తరగతికి, ఏప్రిల్ 19న మిగిలిన తరగతులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని గురుకులం ప్రిన్సిపల్ గుణుపూరు పురుషోధి తెలిపారు. మరిన్ని వివరాలకు www.mjpapbcwreis.pacfss.inను సందర్శించాలన్నారు.

News February 13, 2026

విశాఖలో అంతర్జాతీయ నౌకా దళ విన్యాసాలు.. పటిష్ఠ భద్రత

image

ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల కోసం విశాఖలో 7,000 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాటు చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. రాష్ట్రపతి, 75 దేశాల ప్రతినిధులు హాజరవుతున్న ఈ మహా వేడుక కోసం 64 డ్రోన్లు, ఆధునిక యాప్‌లతో నిఘా పెంచారు. తీర భద్రతను కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశామని, ప్రజలు అనుమానాస్పద సమాచారాన్ని 112 తెలియజేయాలని కోరారు.