News November 6, 2025

కశింకోట: 48 కిలోల గంజాయి పట్టివేత

image

కశింకోట మండలం అచ్చెర్ల జంక్షన్ వద్ద గురువారం 48 కిలోల గంజాయి (20 ప్యాకెట్లు) స్వాధీనం చేసుకున్నట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. ఈగల్ టీమ్ సమాచారంతో తనిఖీలు చేపట్టగా, వైట్ మారుతి కారులో గంజాయిని గుర్తించామన్నారు. గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరొక వ్యక్తి పరారైనట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Similar News

News January 24, 2026

KNR: పట్టభద్రులకు శుభవార్త

image

శాతవాహన విశ్వవిద్యాలయంలో నేడు మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య యు.ఉమేశ్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో 60కిపైగా కార్పొరేట్ కంపెనీల్లో 5000 వేలకు పైగా ఉద్యోగాల్లో నియామకాలు ఉంటాయన్నారు. శాతవాహన వర్సిటీ-నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News January 24, 2026

MNCL: కాజీపేట వరకే సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలు

image

భద్రాచలం రోడ్-బల్లార్షా మధ్య నడిచే 17033/17034 సింగరేణి ఎక్స్‌ప్రెస్ మెమో రైలు ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు పూర్తి స్థాయిలో కాకుండా, కాజీపేట వరకు నడవనుందని రైల్వే అధికారులు తెలిపారు. మందమర్రిలో 3వ లైన్ పనులు, ట్రాక్ మరమ్మతు నేపథ్యంలో ఈ మార్పు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ రైళ్లను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. పనులు పూర్తయిన తర్వాత రైలు యధావిధిగా నడవనుందన్నారు.

News January 24, 2026

రేపు రథ సప్తమి.. ఇలా చేస్తే ఆయురారోగ్యాలు!

image

రేపు మాఘ శుద్ధ సప్తమి. ఆరోగ్య కారకుడైన సూర్యుడు జన్మించిన రోజు. రేపు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అరుణోదయ స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, సూర్య నమస్కారాలు చేయాలని సూచిస్తున్నారు. ఆదిత్య హృదయం పఠిస్తే ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని నమ్మకం. అరుణోదయ స్నానం ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.