News August 13, 2025

కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలి: KTR

image

భారీ వర్షాల నేపథ్యంలో BRS శ్రేణులు ప్రజలకు అండగా నిలవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పార్టీ నేతలతో కేటీఆర్ మాట్లాడారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని BRS శ్రేణులకు కేటీఆర్ సూచించారు.

Similar News

News March 16, 2026

హనుమకొండలో జిల్లా స్థాయి చెస్ పోటీలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగం పోటీలకు హనుమకొండ వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. అండర్-7 నుంచి అండర్-15 విభాగాల్లో బాలబాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.

News March 16, 2026

కౌంటర్ దాఖలు చేయండి.. లిక్కర్ కేసు నిందితులకు ఢిల్లీ HC ఆదేశం

image

లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేయగా ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ ధాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత సహా ఇతర నిందితులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే నెల 5 వరకు తప్పనిసరిగా కౌంటర్ వేయాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆదేశించారు. తదుపరి విచారణ APR 6కు వాయిదా చేశారు.

News March 16, 2026

పెద్దపులి కోసం బెంగుళూరు నుంచి ప్రత్యేక బృందాలు..?

image

కొడిమ్యాల మండలం గంగారాం తండాలో రెండు రోజులుగా పశువులపై పెద్ద పులి దాడి చేయడంతో గంగారాం తండా, దమ్మయ్య పేట సూరంపేట గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రాత్రి పూట బయటకు రావద్దని వారు ప్రజలకు తెలిపారు.