News April 10, 2024
కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధం: ఉమ్మి యూసుఫ్

ఆదోని ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే ఆదోని నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని ఉమ్మి యూసుఫ్ తెలిపారు. ఆయన ఇటీవలే ఎంఐఎం నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆదోనిలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అధిష్ఠానం టికెట్ ఇతరులకు ఇచ్చినా వారితో కలిసి పని చేస్తానన్నారు. అభివృద్ధి జరగాలంటే ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.
Similar News
News December 14, 2025
కబడ్డీలో కర్నూలు బాలికలకు మూడో స్థానం

పల్నాడు జిల్లా పెదకూరపాడులో జరిగిన 51వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో కర్నూలు జిల్లా బాలికల జట్టు మూడో స్థానం సాధించింది. ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 26 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులను ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ అభినందించారు. జట్టులోని ఇందు, లలిత, ప్రశాంతి విశాఖపట్నంలో జరిగే జాతీయ స్థాయి శిక్షణా శిబిరానికి ఎంపికయ్యారు.
News December 14, 2025
లోక్ అదాలత్‌లో 19,577 కేసులు పరిష్కారం

జాతీయ లోక్‌అదాలత్‌లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 19,577 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్తి తెలిపారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 28 బెంచీల ద్వారా 284 సివిల్, 19,096 క్రిమినల్, 197 మోటార్ యాక్సిడెంట్ కేసులను పరిష్కరించారు. మోటార్ ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు రూ. 6.34 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్లు ఆయన వివరించారు.
News December 13, 2025