News March 23, 2024

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి: కొప్పుల ఈశ్వర్

image

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం రామగుండం మున్సిపల్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చందర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఆరోపించారు.

Similar News

News December 12, 2025

KNR: చలి మంట కాగుతూ సిబ్బందితో సేదతీరిన సీపీ గౌష్ ఆలం

image

కరీంనగర్ మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు భద్రతా పర్యవేక్షణలో నిమగ్నమైన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం చలి తీవ్రత దృష్ట్యా కొద్దిసేపు సేదతీరారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షిస్తూ, చలి మంట కాగుతూ ఆయన సిబ్బందితో కొద్ది నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా సీపీ తెలిపారు.

News December 11, 2025

ఫకీర్ పేట్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా విజయలక్ష్మి

image

కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్ పేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బొద్దుల విజయలక్ష్మి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఫకీర్ పేట్ గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. తనను గెలిపించిన గ్రామస్థులకు విజయలక్ష్మి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ పెద్దలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

News December 11, 2025

కరీంనగర్ జిల్లాలో 81.42% పోలింగ్ నమోదు

image

కరీంనగర్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 81.42% పోలింగ్ కాగా, అత్యధికంగా చొప్పదండిలో 83.66% పోలింగ్ నమోదైంది. కరీంనగర్ రూరల్లో 84.67%, రామడుగులో 82.05%, గంగాధరలో 78.70%, కొత్తపల్లిలో 79.19% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 91 గ్రామ పంచాయితీల్లో 152408 ఓట్లకు గాను 124088 ఓట్లు పోలయ్యాయి.