News June 21, 2024
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్

దేశంలో హోం మంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ మాత్రమేనని BRS నేత RS ప్రవీణ్ కుమార్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హోం శాఖ, విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, రకరకాల శాఖలు తన గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాన్ని పూర్తిగా అభద్రతా భావంలోకి నెడుతున్నారని పేర్కొన్నారు. 24 గంటల్లో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు జరుగుతుంటే శాంతి భద్రత వ్యవస్థ ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు.
Similar News
News January 24, 2026
మహబూబ్‌నగర్: విద్యుత్ సమస్యలకు చెక్

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో ఉన్న మొక్కలను తొలగిస్తున్నామని ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ భీమా నాయక్ తెలిపారు. తిరుమలాపూర్ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నామన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని పలువురు ఎస్ఈకి ఫిర్యాదు చేయగా పనులు చేపట్టామని చెప్పారు.
News January 23, 2026
గంగాపురం జాతరకు ప్రత్యేక బస్సులు

గంగాపురంలో కొలువైన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ సంతోశ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారికి సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
News January 23, 2026
MBNR: ఎంవీఎస్ కళాశాలలో రేపు జాతీయ స్థాయి సెమినార్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ స్థాయి బహుశాఖ సెమినార్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. కె.పద్మావతి తెలిపారు. విద్యా, వైద్య, పరిశోధన రంగాల్లోని నూతన ఆవిష్కరణలపై ఈ సదస్సు జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా టీజీసీహెచ్‌ఈ ఛైర్మన్ ప్రొ. వి.బాలకృష్ణారెడ్డి, గౌరవ అతిథిగా పాలమూరు వర్సిటీ వీసీ ప్రొ. జి.ఎన్.శ్రీనివాస్ హాజరుకానున్నారు.


