News December 2, 2025

కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు: కవిత

image

విద్యా శాఖ స్వయంగా CM వద్దే ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం సిగ్గుచేటని జాగృతి చీఫ్ కవిత అన్నారు. గద్వాలలోని ST సంక్షేమ హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆమె X వేదికగా స్పందించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయటపెట్టిందన్నారు.

Similar News

News February 18, 2026

అనంత: హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

image

హోలీ పండుగ సందర్భంగా రైల్వే శాఖ తిరుపతి-రాక్సౌల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈనెల 21, 28న, మార్చి 7న తిరుపతి నుంచి ఉదయం 8.15 గంటలకు రైలు(07051) బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాక్సౌల్ చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24న, మార్చి 3, 10న ఉదయం 8.30 గంటలకు రాక్సౌల్ నుంచి బయలుదేరి రెండో రోజు సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు తాడిపత్రి, గుంతకల్లు మీదుగా నడుస్తాయి.

News February 18, 2026

పార్టీ నేతలపై బొత్స పట్టు కోల్పోయారు: లోకేశ్

image

AP: మండలిలో YCP పక్షనేత బొత్స సత్యనారాయణ ఆ పార్టీ నేతలపై పట్టు కోల్పోయారని మంత్రి లోకేశ్ విమర్శించారు. ‘YCP నుంచి ఇద్దరు MLCలు వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఒకరు లడ్డూ కల్తీపై, మరొకరు ఇందాపూర్ డెయిరీపై చర్చ అడిగారు. వారిలో ఎవరు పైచేయి సాధిస్తారనే ఆసక్తి మాలో ఉంది’ అని మీడియాతో వ్యాఖ్యానించారు. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్‌తో సంబంధం ఉందని, అందుకే చర్చ పెట్టాలని అడుగుతున్నట్లు బొత్స తెలిపారు.

News February 18, 2026

నిజామాబాద్‌లో టమాటా ధర ఎంతంటే?

image

నిజామాబాద్‌లో టమాటా ధర బాగా తగ్గింది. హోల్‌సేల్‌లో కిలో రూ.4-5 ఉండగా రిటైల్ మార్కెట్‌లో రూ.10 కిలోగా ఉంది. ఇక బెండకాయ, బీరకాయ రూ.80 కిలో, పచ్చి మిర్చి రూ.70, ఆలుగడ్డలు రూ.20, చిక్కుడుకాయ రూ.40, క్యాప్సికం రూ.60, క్యారెట్ రూ.50, బీట్ రూట్ రూ.50, వంకాయ రూ.40, చామ గడ్డ రూ.50, బిన్నీస్ రూ.80 కిలో, సొరకాయ ఒకటి 10 నుంచి 20 రూపాయలుగా ఉంది. కొత్తిమీర కట్ట రూ.10 నుంచి 20 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.