News November 19, 2025
కాంగ్రెస్ మేలుకోకపోతే కష్టం: ముంతాజ్

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.
Similar News
News January 17, 2026
గ్రేటర్ వరంగల్ ఇక అందరిదీ!

గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. గ్రేటర్‌లో 66 డివిజన్లు, 11 లక్షల జనాభా ఉంది. ప్రస్తుతం 66 డివిజన్లు ఉండగా 88 డివిజన్లకు పెంచాలని అనుకున్నారు. అనుహ్యంగా 66 డివిజన్లకు రిజర్వేషన్లు ప్రకటించారు. తాజాగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌ను జనరల్‌కు కేటాయించగా, ప్రస్తుతం బీసీ మహిళకు కేటాయించారు. ఇకపై పోటీ భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
News January 17, 2026
3 రోజుల్లోనే రూ.61.1 కోట్లు

నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ.61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 14 విడుదలైన ఈ మూవీ తొలి రోజు రూ.22 కోట్లు, రెండు రోజుల్లో రూ.41.2కోట్లు సాధించింది. మారి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు.
News January 17, 2026
నగలు సర్దేయండిలా..

మహిళలకు అలంకారం, ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి లేటెస్ట్‌గా ఏ నగ వచ్చినా సరే కొనేయాల్సిందే. అయితే వాటిని సరిగ్గా భద్రపరచకపోతే అవి కొన్నాళ్లకు రంగుమారి పాడైపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే..ఆభరణాలు భద్రపరిచే ముందు శుభ్రంగా తుడిచి ఆరబెట్టిన తర్వాతే బాక్సుల్లో సర్దాలి. అన్ని రకాల నగలను ఒకే బాక్సులో పెట్టకూడదు. విడివిడిగా ఎయిర్‌టైట్ బాక్సులు, జిప్ లాక్ బ్యాగులు వాడాలి.


