News May 1, 2024
కాంగ్రెస్ రాజకీయం ముందు బిజెపి బచ్చా: జగ్గారెడ్డి వ్యాఖ్యలు

బిజెపి, కాంగ్రెస్ పుట్టు శత్రువులని, కాంగ్రెస్ రాజకీయ ముందు బిజెపి బచ్చా.. అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. మోడీ, అమిత్ షాలకు భయం పట్టుకొని ఢిల్లీ పోలీసులను గాంధీభవన్‌కు పంపారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ అంటే వారికి దడ పుట్టింది అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు సాధించి రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇస్తామన్నారు.
Similar News
News December 11, 2025
మెదక్: ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సందర్శన

మెదక్ జిల్లా మొదటి విడతలో పంచాయతీ ఎన్నికల సందర్బంగా పెద్ద శంకరంపేట, రేగోడు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ సందర్శించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. మొదటి విడత మాదిరిగానే రాబోయే రెండు, మూడు విడతల్లో పారదర్శకంగా పనిచేయాలన్నారు.
News December 11, 2025
మెదక్: ‘ఉపాధ్యాయులకు ఓడి అవకాశం కల్పించాలి’

మెదక్ జిల్లా విద్యాధికారిని గురువారం ఉపాధ్యాయ సంఘం నాయకులు కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులందరికీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఓడి సదుపాయం కల్పించాలని మెదక్ జిల్లా విద్యాధికారి విజయకు ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉన్నవారికి సమస్యలు పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.
News December 11, 2025
మెదక్: 88.46% ఓటింగ్‌గా తేల్చిన అధికారులు

మెదక్ జిల్లాలో ఆరు పంచాయతీలలో జరిగిన ఎన్నికలలో 88.46 శాతం ఓట్లు పోలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. 1,63,148 ఓటర్లు ఉండగా 1,44,323 ఓట్లు పోలైనట్లు వివరించారు. ఎన్నికలలో 89.68% పురుషులు, 87.34 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 69,933 మంది పురుషులు, 74 వేల 388 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు.


