News February 11, 2025
కాంగ్రెస్ షోకాజ్ నోటీసును పట్టించుకోను: తీన్మార్ మల్లన్న

కాంగ్రెస్ ఇచ్చిన షోకాజ్ నోటీసును పట్టించుకోనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. నల్గొండలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌కు ఆయన హాజరై మాట్లాడారు. బీసీ ఉద్యమాన్ని అణచివేయడానికి ఓ వర్గం చేస్తున్న కుట్రనే షోకాజులు అని మండిపడ్డారు. అభ్యర్థులు పూల రవీందర్, సుందర్ రాజ్ యాదవ్‌కు బీసీలు ఓట్లు వేసుకున్నా బంపర్ మెజార్టీతో గెలుస్తారన్నారు. ఇతర వర్గాలకు చెందిన వారికి డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు.
Similar News
News February 17, 2026
కృష్ణా: మంత్రి ఇలాకాలో లిక్కర్ పంచాయితీ కొట్లాట..!

మచిలీపట్నంలో లిక్కర్ సిండికేట్ల వివాదం ముదురుతోంది. లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద బార్ ఏర్పాటుపై వ్యాపారి లింగం ఆనంద్, జనసేన నేత శీను మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీని వెనుక వైసీపీ నేత సుబ్బన్న హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సిండికేట్ ఒత్తిళ్లు భరించలేక ఓ వైన్ షాప్ యజమాని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సొంత ఇలాకాలోనే ఇలాంటి ఘటనలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
News February 17, 2026
కొత్తగూడెం: పవర్ షేరింగ్‌పై హస్తం పార్టీలో రుసరుసలు

కొత్తగూడెం కార్పొరేషన్‌లో పవర్ షేరింగ్ ఫార్ములా కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. 28 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ, కేవలం 22 సీట్లు గెలిచిన సీపీఐకి మేయర్ పదవిని కట్టబెట్టడంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని నిరసిస్తూ 26వ డివిజన్ కార్పొరేటర్ రాజేశ్ నల్ల బ్యాడ్జీతో నిరసన తెలపడం చర్చనీయాంశమైంది. కార్యకర్తల అభిప్రాయాలను విస్మరించారని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News February 17, 2026
అనకాపల్లి జిల్లాలో క్రీడలను ప్రోత్సహించాలి: కలెక్టర్

జిల్లాలో క్రీడలను ప్రోత్సహించి మంచి క్రీడాకారులను తయారు చేయాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారిని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి వారికి సరైన ప్రోత్సహం అందిస్తే అద్భుతంగా రాణిస్తారని పేర్కొన్నారు. యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. జిల్లా క్రీడాభివృద్ది అధికారిణి శైలజతో కలిసి క్రీడల గోడపత్రిక ఆవిష్కరించారు.


