News December 1, 2025
కాకినాడలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 వరకు కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీల పురోగతి, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 11, 2026
SRPT: ఓటు వేయడానికి తరలిరండి: కలెక్టర్

మున్సిపాలిటీలో ఎన్నికలలో ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించు కోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండాలని, పార్టీలతో సంబంధం లేకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన పోలింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
News February 11, 2026
HYD: ‘అ’క్షరం.. ‘ఆ’కలి దుఃఖంలో కలిశాయి!

పాఠశాల ముగియగానే పిల్లలు గంతులేసుకుంటూ ఇళ్లకు వెళ్లి ఆడుకుంటారు. కానీ, ఈ చిన్నారి కథ వేరు. స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా, మాదాపూర్‌లోని BIG C ముందు తల్లి కూర్చునే ఫుట్‌పాత్ వద్దకు వెళ్తుందా పాప. చెప్పులు కుట్టడంలో తల్లికి సాయం చేస్తూ, కస్టమర్లులేని సమయంలో హోంవర్క్ రాస్తోంది. చదవడానికి ఇంట్లో కనీస వసతులు లేకపోయినా, వీధి దీపాల వెలుతురులో చదువుతోంది. ఈ బుజ్జితల్లి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుందాం.
News February 11, 2026
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కాకినాడ జిల్లా గళం వినిపించేనా?

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కాకినాడ జిల్లా సమస్యలపై చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు జిల్లాలోని ఆరుగురు ఎమ్మెల్యేలు (ఒకరు జనసేన, ఐదుగురు టీడీపీ) అసెంబ్లీలో జిల్లా గళాన్ని ఎంతవరకు వినిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల మంజూరుపై ఈ ప్రజాప్రతినిధులు గట్టిగా పోరాడి జిల్లాకు మేలు చేస్తారా అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.


